ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ఈరోజు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖులు వీరే!

  • మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం
  • నామినేషన్లు వేసిన కేటీఆర్, రేవంత్, తుమ్మల, నామా తదితరులు
  • కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ రోజు నామినేషన్లు వేసిన రాజకీయ ప్రముఖులు వీరే.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు. స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ పావనితో కలసి వచ్చిన ఆయన... రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. నిడమానూరులో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన రేవంత్ రెడ్డి కొడంగల్ లో నామినేషన్ వేశారు. గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ, ఖమ్మంలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యలు నామినేషన్ దాఖలు చేశారు.
Go Back to Shorts
nomination
telangana
elections

More Telugu News